జనసేన ఎమ్మెల్యే రాపాకకు హైకోర్టు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

జనసేన ఎమ్మెల్యే రాపాకకు హైకోర్టు నోటీసులు

October 22, 2019

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నోటీసులు జారీ చేసింది. రాపాక గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ..రాజోలు వైసీపీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

jana sena mla..

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు..జనసేన ఎమ్మెల్యేకు, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. రాపాకపై వస్తున్న ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. అలాగే రాపాకకు నోటీసులు పంపించారు. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మరో మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్, వైసీపీ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాదరావు పోటీ చేసి గెలిచిన సంగతి తెల్సిందే.