దాడి జగన్ స్వయంకృత అపరాధం!: హోం మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

దాడి జగన్ స్వయంకృత అపరాధం!: హోం మంత్రి

October 25, 2018

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కోళ్లపందెం కత్తి దాడి సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ సంఘటన జరిగిందని పార్టీ నేతలు మండిపడుతున్నారు. కత్తికి విషం పూసి ఉండే అవకాశం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. మరోపక్క ఈ దాడిపై ఏపీ హోం మంత్రి రాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.Andhra Pradesh home minister chinarajappa controversial comments on attack YSR Jagan Mohan at Visakhapatnam airport allege victim negligence దాడి జగన్ స్వయంకృత అపరాధం అన్నట్లు మంత్రి మాట్లాడారు. దాడిని ఖండిస్తున్నానని, ఇలాంటివి పునరావృతం కాకూడదని అంటూనే జగన్‌ను విమర్శించారు. ‘దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశాడు? ఏ పార్టీకి చెందిన వాడు వంటి పూర్తి వివరాల్ని సేకరిస్తున్నాం. ప్రజలందరూ అర్ధం చేసుకోవాలని, సంయమనం పాటించాలని కోరుతున్నాను… భద్రతా వైఫల్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు. జగన్ సెల్ఫీ అనగానే ముందుకొచ్చి ముద్దులంటాడు. దాడి చేసిన వ్యక్తి  జగన్ పొగడటానికి అతని వద్దకు వచ్చాడు.. అలాంటి సందర్భాల్లో జగన్ జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రజాప్రతినిధి అయినా జాగ్రత్తగా ఉండాలి. మాతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు కదా.. మేం జాగ్రత్తగా ఉంటున్నాం..’ అని అన్నారు. కాగా దాడి చేసిన వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఠాణేలంక ప్రాంతానికి చెందిన జనిపెల్ల శ్రీనివాస్ గా గుర్తించారు. ఎయిర్ పోర్ట్లో ఏడాదిగా వెయిటర్గా పనిచేస్తున్న అతడు పక్కా పథకం ప్రకారం దాడి చేశాడని, అతని జేబులోని 8 పేజీల పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నామని ఏపీ పోలీసులు చెప్పారు.