Andhra Pradesh junior doctors go on strike for hike in stipend
mictv telugu

ఏపీలో ప్రభుత్వ డాక్టర్ల సమ్మె సైరన్… పేషంట్ల బేజార్!

October 21, 2022

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించనున్నాయి. స్టయిఫండ్ పెంపు కోసం జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. స్టయిపెండ్‌ను 42 శాతం పెంచాలాని, లేకపోతే ఈ నెల 26 నుంచి ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరిస్తామంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. తమకిస్తున్న స్టయిపెండ్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరిచి పనిచేస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే 26 తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని నోటీసులో పేర్కొన్నారు. 1 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ డాక్టర్లు పాల్గొంటారని వెల్లడించారు. నోటీసులో తమ సమస్యలను ఏకరవు పెట్టారు.

’మిగతా రాష్ట్రాల్లో హౌస్ సర్జన్లకు రూ. 30 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.65 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.80 వేలు ఇస్తున్నారు. ఏపీలో మాత్రం హౌస్ సర్జన్లకు రూ.19 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.44 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.53 వేలే ఇస్తున్నారు. ఇందుకీ అసమానత్వం’ అని ప్రశ్నించారు. కాగా, స్టయిపెండును త్వరలోనే పెంచుతామని, ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.