ఏపీలో తగ్గిన లిక్కర్ అమ్మకాలు..తాజా గణాంకాలు ఇవే..!  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో తగ్గిన లిక్కర్ అమ్మకాలు..తాజా గణాంకాలు ఇవే..! 

December 3, 2019

Liquor Sales 01

ఏపీలో మద్యం అమ్మకాల జోరుకు అడ్డుకట్ట పడింది. ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా లిక్కర్ పాలసీ విధానంతో గతేడాది కంటే ఈసారి అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. మద్య నిషేధం చేస్తానంటూ చెప్పిన సీఎం జగన్ మొదటి విడతగా వైన్ షాపులు తగ్గించడంతో పాటు సమయాలను కుదించారు. షాపులన్నీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తుండటంతో, ధరలు పెరగడంతో అమ్మకాలు గణనీయంగా తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. 

గత ఏడాది లెక్కల ప్రకారం చూస్తే లిక్కర్ అమ్మకాలు 22.31 శాతం, బీర్ల అమ్మకాలు 54.30 శాతం తగ్గాయి. 2018 నవంబర్ లో 29.62 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. కానీ ఈ సంవత్సరం 22.31 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. బీర్లు కూడా 17.80 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి.  ఈ సంవత్సరం 8.13 లక్షల కేసులు మాత్రమే విక్రయాలు జరిగాయి. ఈ లెక్కల ప్రకారం దశలవారిగా మద్య నిషేధం మరింత సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పెరిగిన ధరలు, మద్యం షాపులు త్వరలగా మూసివేయడం దీనికి కారణమని అంటున్నారు.