కొందరు హిజ్రాలు మరీ దుర్మార్గంగా తయారయ్యారు. పొట్టకూటి కోసం చప్పట్లు కొట్టి అడుక్కునే ట్రాన్స్జెండర్లు కొంతమందైతే, మరికొందరు గూండాలకు రౌడీలకు ఏమాత్రం తీసిపోకుండా ఘోరాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని బెంగళూరులో హిజ్రాలు ఓ హోటల్లో నిర్బంధించి దారుణానికి తెగబడ్డారు. బాధితుడు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ శ్రీనివాస్ అనే నడివయస్కుడు డిసెంబర్ 30న బెంగళూరులోని ఓ హోటల్లో భోంచేసి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు హిజ్రాలు అడ్డుకున్నారు. అతణ్ని బలవంతంగా ఆటో ఎక్కించి రెసిడెన్సీ రోడ్డులోని హోటల్‌కు తీసుకెళ్లారు. మరో ఇద్దరు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాస్ బట్టలు విప్పి అసభ్యంగా వీడియోలు తీశారు. అతని నగలను డబ్బును గుంజుకున్నారు. అంతేకాకుండా పిన్ నంబర్ చెప్పించుకుని యూపీఏ, డెబిట్ కార్డుల ద్వారా దాదాపు 4 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని పారిపోయారు. ఇది అసలైన హిజ్రాల పనా? లేకపోతే నేరస్తులు చీరలు కట్టుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.