కొడాలి నాని వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. వైకాపా నేత - MicTv.in - Telugu News
mictv telugu

కొడాలి నాని వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. వైకాపా నేత

September 24, 2020

Andhra pradesh minister kodali nani comments on pm modi

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని ప్రధాని మోదీపై బుధవారం అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ రామమందిరం భూమి పూజకు తన భార్యను తీసుకుని వెళ్ళారా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నిరసన చేపట్టారు. ఈ వివాదంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంత్రి కొడాలి నాని ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. దేశానికి ప్రధానిగా ఉన్న మోదీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. వాటితో పార్టీకి సంబంధం లేదన్నారు. 

ఆ వ్యాఖ్యలు నాని వ్యక్తిగతమన్నారు. ప్రధానిపై మంత్రి కొడాలి నాని ఏం వ్యాఖ్యలు చేశారో తెలియదని తెలిపారు. పార్టీల నేతలు సంయమనం పాటించాలని సూచించారు. ఈ విషయంలో కొడాలి నాని వాస్తవాన్ని గ్రహించి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రధాన ప్రతిపక్షం హస్తం ఉందని సజ్జల ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజల్లో ప్రతిపక్షం చులకన అవుతుందన్నారు. మతం పేరుతో టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. అమరావతి భూ కుంభకోణంపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే టీడీపీ కొత్త వివాదం సృష్టిస్తోందని తెలిపారు. అత్యంత భక్తి భావంతో సీఎం జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని చెప్పారు. అమరావతిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో సజ్జల ఈరోజు మీడియాతో మాట్లాడారు.