Andhra Pradesh minister Roja reveals ap cm jagan mohan reddy food habits details
mictv telugu

జగన్‌కు ఆ పులిహోర బాగా ఇష్టం.. రోజా వెల్లడి

January 2, 2023

మన ముఖ్యమంత్రుల్లో స్ట్రాంగెస్ట్ ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని టాక్. యాభై ఏళ్లు వచ్చినా యంగ్ లుక్‌తో ఎనర్జిటిగ్గా కనిపించే జగన్ ఆరోగ్య రహస్యమేమిటని చాలా మందికి ఆసక్తి. తనకు ఏ చెడు అలవాట్లూ లేవని, అందుకే ఇలా ఉన్నానని ఆయన అంటుంటారు. ఆయితే ఆయన ఫిట్‌నెస్‌కు కారణం ఏమిటో ఏమిటో పర్యాటక శాఖ మంత్రి, నటి రోజా బయటపెట్టారు. ముఖ్యంగా ఓ డ్రింక్ వల్ల ఆయన ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. జగన్ పాదయాత్ర సమయంలో నగరికి వచ్చిన తను ఆయన ఆహార అలవాట్లు గమనించానన్నారు. ఆయనలా తింటే సైజ్ జీరో అని చెప్పారు. రోజా చెప్పిన వివరాల ప్రకారం.. జగన్‌కు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. రోజూ ఒక పుల్కా, ఉడకేసిన కాయగూరలు తింటారు. మాంసాహారం వారానికి ఒక రోజే. కీమాను అంటే బాగా ఇష్టం. లీటరు పాలలో పచ్చి అల్లం వేసి ఓ గ్లాసు అయ్యేంతవరకు బాగా మరగనిచ్చి తాగుతారు. అవి ఆయన ఎనర్జీకి కారణం. మామిడికాయ తురుముతో చేసిన పులిహోర కూడా ఇష్టం. రాయలసీమ ఫేమస్ చిత్రాన్నం కూడా క్రమం తప్పకుండా తింటారు. పల్లీలు, మొక్కజొన్న పొత్తులు, డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు.