సినిమాలు, రాజకీయాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడి వాళ్ళు రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. సినిమాల్లో వెలిగిన వారు రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగారు చాలా మంది. అయితే రాజకీయాల్లో ఉన్నవారు తె మీద కనిపించడం తక్కువే. కానీ తెర వెనుక మాత్రం బాగానే ఉంటారు. అంటే నిర్మాతలుగా, సమర్పకులుగా, థియేటర్ల ఓనర్లుగా ఇలా….ఇప్పుడు ఇలానే రాజకీయాల్లోంచి మరో వ్యక్తి సినిమాల్లోకి రాబోతున్నారని సమాచారం. ఏపీ కి మంత్రి అయిన విడదల రజని సినిమాల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజనీ సినిమా నిర్మాతగా రంగ ప్రవేశం చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అయితే అధికారికంగా దీని మీద ఎటువంి ప్రకటనా రాలేదు. సినీ సర్కిల్లో మాత్రం రజనీ నిర్మాణ రంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, దాని కోసం ఓ నిర్మాణ సంస్థ కూడా స్థాపించారని చెప్పుకుంటున్నారు. కథా చర్చలు చేయడానికి హైదరాబాద్ లో ఒక ఆఫీస్ కూడా తీసుకున్నారని వార్తలు వినపడుతున్నాయి.ఆల్రెడీ ఒక సినిమా రెడీగా ఉందని, నటీనటులు, డైరక్టర్ ని ఫైనల్ చేయాలని అంటున్నారు.దీని మీద అఫీషియల్ న్యూస్ కోసం వెయిటింగ్.
విడదల రజని 2014 నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు. మొదట తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. కానీ తరువాత ఏపీలో పరిణామాలతో వైసీపీలోకి చ్చేశారు. 2019 ఎలక్షన్స్ లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. రీసెంట్ గా జరిగిన ఏపీ మంత్రివర్గ పున: వ్యవస్థీకరణలో రజనీకి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దక్కింది.