ఏపీ అధికార పార్టీ వైకాపా చేపట్టిన గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వంపై ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. జనం న్యాయమైన డిమాండ్లతోపాటు వింత వింత కోరికలు కూడా కోరుతున్నారు. గడప గడపకు వెళ్లిన నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు ఓ వృద్ధుడు దిమ్మతిరిగే డిమాండ్ చేశాడు. ‘రోజమ్మా.. ఒంటరిగా బతుకుతున్నాను. నెలనెల పింఛను వస్తోంది.నాకు పెళ్లి చేయి.’ అని అన్నాడు. దీంతో మంత్రి అవాక్కైంది. పెన్షన్ ఇవ్వగలం గానీ పెళ్లి ఎలా చేస్తామని నవ్వుతూ బదులిచ్చింది.