Andhra Pradesh mlc challa Bhageeratha Reddy Ramakrishna Reddy health bulletin
mictv telugu

ఎమ్మెల్సీ చల్లా పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు

November 2, 2022

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఆరోగ్యం పరిస్థితి చేయిదాటింది. అత్యంత విషమంగా ఉండడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనను కాపాడ్డానికి వైద్యులు ఆక్సిజన్ అందిస్తూ నిత్యపర్యవేక్షిస్తూ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కొన్నాళ్లుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న చల్లా తీవ్రమైన దగ్గు రావడంతో ఇబ్బంది పడ్డారని ఆదివారం రాత్రి నంద్యాల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించామని బంధువులు చెప్పారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. నంద్యాల జిల్లా అవుకుకు చెందిన భగీరథ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు. 2021లో తండ్రి మరణంతో ఆయనను జగన్ ఎమ్మెల్సీని చేశారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.