ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్మెంట్లోని తన ఫ్లాటులో విగతజీవిగా కనిపించారు. ఆయన మూడు రోజుల కిందటే ఇంటికొచ్చారు. తొలుత ఆత్మహత్య అని వార్తలు వచ్చినా తర్వాత ఇరుగుపొరుగు వారి వివరాలతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాంట్రాక్టు బిల్లులు పాస్ కాలేదని ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యే ఆత్మహత్య చేసుకున్నారని మరో వాదన వినిపిస్తోంది. ఆయన స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని పప్పిరెడ్డి పల్లె.