ఏపీలో రెడ్, ఆరెంజ్ గ్రీన్ జోన్లు ఇవే..
కరోనా లాక్‌డౌన్ ఎత్తివేత సమయం దగ్గరపడుతుండడంతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ జోన్లను ప్రకటించింది. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో రెడ్ జోన్లో ఉంచింది. ఆరెంజ్ జోన్లలో పాక్షికంగా, గ్రీన్ జోన్లలో కొన్ని నిబంధనలతో పూర్తిగా పనులు చేసుకోడానికి వీలు కల్పించింది.
రెడ్‌జోన్ కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి. ఆరెంజ్ జోన్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం ఉన్నాయి. ఒక్క కేసూ నమోదు కాని విజయనగరం జిల్లాను గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్‌జోన్లలో మెడికల్ క్యాంపులను నిర్వహించాని ఆదేశించార. అలాగే కరోనా నిర్ధారణ పరీక్షలు బాగా పెంచాలన్నారు. ఏపీలో 1403 కేసులు నమోదు కాగా 31 మంది చనిపోయారు. తెలంగాణలో కేసులు తగ్గుతుండగా ఏపీలో పెరుగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదని, కేసుల విషయంలో ప్రభుత్వాలు గోల్ మాల్ చేస్తున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.