Andhra Pradesh revenue minister Dharmana prasada rao hint resignation
mictv telugu

ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన రాజీనామా!

October 21, 2022

విశాఖ రాజధాని గొడవ ముదురుతోంది. రాజీనామాల బెదిరింపులతో పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. విశాఖ రాజధాని డిమాండ్ కోసం తాను రాజీనామా చేస్తానని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపాదించారు.

రాజీనామా లేఖను కూడా అందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విశాఖ రాజధాని కోసం పదవి వదులుకోవాల్సిన అవసరం లేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ధ్యేయమంటూ జగన్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రపై అంత ప్రేమ ఉంటే ధర్మాన ఆక్రమించుకున్న భూములను ప్రజలకు పంచిపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ధర్మాన సీఎంతో భేటీ కావడం గమనార్హం. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. భూ కబ్జాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఇచ్చిన నివేదిక వివరాలను వెల్లడించారు. విశాఖ రాజధాని కోసం చోడవరం ఎమ్మెల్యేగా కొ కరణం ధర్మశ్రీ రాజీనామా చేయడం తెలిసిందే. ధర్మాన కూడా రాజీనామా చేస్తానని చాలాసార్లు చెప్పుకొచ్చినా చెయ్యలేదు.