ఏపీలో స్కూళ్ల ఓపెనింగ్ మళ్లీ వాయిదా.. నవంబర్ 2న..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో స్కూళ్ల ఓపెనింగ్ మళ్లీ వాయిదా.. నవంబర్ 2న.. 

September 29, 2020

Andhra Pradesh schools reopening postponed .

కరోనా వైరస్ కారణంగా మూతపడిన స్కూళ్లు పిల్లల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎంత ఆన్‌లైన్ పాఠాలైనా స్కూల్లో వింటున్నట్లు ఉండటం లేదని పిల్లలు వాపోతున్నారు. అన్‌లాక్ ప్రక్రియ ఊపందుకోవడంతో వచ్చే నెల.. అక్టోబర్ 5న స్కూళ్లను తిరిగి ప్రారంభించాలనుకున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. ఏకంగా మరో నెల వాయిదా వేసింది. నవంబర్ 2న పాఠశాలలను, కళాశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది. 

వాస్తవానికి విద్యాలయాలు ఈ నెల 5నే తెరుచుకోవాల్సి ఉండింది. అయితే కేంద్రం అందుకు ఒప్పుకోకపోవడంతో అక్టోబర్ 5కు వాయిదా వేశారు. ఆ రోజు జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించి, పిలలకు అవసరమైన సామగ్రి కిట్లను కూడా అందజేయాలని అనుకున్నారు. అయితే  రేపో మాపో వెలువడనున్న అన్ లాక్ 5.o నిబంధనల్లో స్కూళ్లను తిరిగి తెరిచే అవకాశం లేదని కేంద్రం లీకులు ఇస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నవంబర్ 2ను ఫిక్స్ చేసుకుంది. క్లాసులు తగ్గిపోవడంతో సిలబస్‌ను కూడా మరింత తగ్గించే అవకాశముందని  భావిస్తున్నారు.