ఏపీకి ప్రత్యేక హోదా కష్టమే.. వైకాపా ఎంపీ  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి ప్రత్యేక హోదా కష్టమే.. వైకాపా ఎంపీ 

July 1, 2020

bcgbbnh

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనపై ఆశలు అడుగంటిపోతున్నాయి. విపక్షాలే, కాదు అధికార పక్షం కూడా అది సాధ్యం కాదనే ఆలోచనకు వచ్చేసింది. ఏపీకి ఆ హోదా రావడం కష్టమని కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చేశారు. అయితే దీనికి ప్రత్నామ్నాయం కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ, మంత్రి  పదవికి ఆయన ఈ రోజు రాజీనామా చేసిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. 

‘సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం చాలా పోరాట చేశారు. కానీ కేంద్రం దానికి మొగ్గచూపడం లేదు. నా ఇరవై ఏళ్ల రాజకీయ అనుభవంతో రాష్ట్రాభివృద్ధికి రాజ్యసభలో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. మంత్రిగా నేను బాగా పనిచేశాను.. జగన్ నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. చాలా తృప్తిగా ఉంది. పార్లమెంట్‌కు వెళ్లాలన్న కోరిక నెరవేరింది..’ అని చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశాన్ని ప్రస్తావిస్తూ పార్టీ జెండాపై గెలిచిన వాళ్లు పార్టికి విధేయతతో ఉండాలని అన్నారు.