ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 25న ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాను పిడుగురాళ్లలో నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
@AP_Skill – @SEEDAP_AP & #EmploymentExchange has Jointly Conducting Mega Job Mela at Agriculture Market Yard Near RTC Bus Stand #Piduguralla #PalnaduDistrict
Registration Link:https://t.co/ex00Gsyqs5
Contact:
9160200652
9010585360
9866822697
APSSDC Helpline – 9988853335 pic.twitter.com/Wu77g3Xhoe— AP Skill Development (@AP_Skill) February 22, 2023
Axis Bank: ఈ సంస్థలో 45 ఖాళీలు ఉన్నాయి. లోన్స్ డిపార్ట్మెంట్, RO, RE విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. పిడుగురాళ్ల, గుంటూరు , విజయవాడ , ఏపీ, తెలంగాణలో ఎక్కడైన పని చేయాల్సి ఉంటుంది. సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.25 వేల వరకు శాలరీలు చెల్లించనున్నారు.
Hetero Drugs: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ, బీ/ఎం ఫార్మసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.17 వేల వరకు జీతాలు ఇస్తారు.
Apollo: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్/ఫార్మసీ అసిస్టెంట్/ఫార్మసీ ట్రైనీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎం/బీ/డీ ఫార్మసీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
Navata Transport: ఈ సంస్థలో 45 ఖాళీలు ఉన్నాయి. లోడింగ్, అన్ లోడింగ్ క్లర్క్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.9500 నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
ఇతర వివరాలు:
• అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా https://docs.google.com/forms/d/e/1FAIpQLSekuSDPqMivnST6T2vNSrS3W2EttkDgT3C8aQ7lo_Ab0qnSDg/viewform ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
• రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 25న ఉదయం 9 గంటలకు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పిడుగురాళ్ల చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
• అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9160200652, 9010585360, 9866822697 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.