ఏపీ, తెలంగాణ మళ్లీ పస్తులే.. చెయ్యి విదల్చని కేంద్రం   - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ, తెలంగాణ మళ్లీ పస్తులే.. చెయ్యి విదల్చని కేంద్రం  

February 1, 2018

కేంద్ర తాజా బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు జైట్లీ యథాప్రకారం మొండిచెయ్యే చూపించారు. విభజన సమస్యలతో అల్లాడుతున్న ఈ రెండు రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులూ జరపలేదు. విద్యాసంస్థలకు, ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు నిధులు తప్ప చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ఇందులో చాలా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికే కావడం గమనార్హం. బెంగళూరు మెట్రోకు 17వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు 17వేల కోట్లు కేటాయించడం గమనార్హం.

విశాఖ రైల్వే లైన్ ఊసులేదు..  

విభజన తర్వాత రైల్వే విషయంలో తీవ్రంగా దెబ్బ తిన్న ఏపీ.. విశాఖ రైల్వే జోన్ పై పెట్టుకున్న ఆశపై జైట్లీ నిప్పులు పోశారు. ఈ  జోన్ పై ఇచ్చిన హామీని దారుణంగా విస్మరంచారు.

 ఏపీకి దక్కిన నిధులు..

ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు, ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు, ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఎంకు రూ.42 కోట్లు, ఏపీ ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు,  ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49 కోట్లు, ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5 కోట్లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1400 కోట్లు 

 తెలంగాణకు దక్కిన నిధులు. .

తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు, హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75 కోట్లు, సింగరేణికి రూ.2 వేల కోట్ల పెట్టుబడులు