బంగారం దొంగతనాల తర్వాత ఎక్కువగా జరుగుతోంది భూమి దొంగతనాలే! భూముల ధర బంగారం ధరకు మించి ఎగబాకుతుండడంతో అక్రమార్కుల కళ్లు వాటిపై పడుతున్నాయి. ఎక్కడైనా కాస్తా ఖాళీ జాగా కనిపిస్తే చాలు రౌడీ మూకలు వాలిపోతున్నాయి. సామాన్యుల భూములను కాదు, పలుకుబడి ఉన్న వారి జాగాలను కూడా కబ్జా చేస్తున్నారు. ఏపీలోని కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారు. సొంత పార్టీ నాయకులే తన భూమిని కాజేయడంతో ఆమె కంగు తున్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… సుధకరు కడప నగర శివారులో 27 సెంట్ల భూమి ఉంది. స్థానిక వైసీపీ నాయకులు దాన్ని ఆక్రమించారు.
అక్కడికి ఎవర్నీ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. విషయం తెలుసుకున్న సుధ వారిని ప్రశ్నించింది. అయితే అది తమ భూమేనని, కావాలనుకుంటే రెండు సెంట్లు ఇస్తామని అక్రమార్కులు చెప్పారు. దీంతో ఆమె కడప ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుని, తన భూమిని తిరిగి తమకు అప్పగించాలని కోరారు.