మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. నెటిజన్లు ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. నెటిజన్లు ఫిదా

September 22, 2019

sridevi ...

వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఎం శ్రీదేవి మానవత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె తన వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు పైనే ప్రథమ చికిత్స అందించారు. ఈ ఉదయం ఆమె విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా పెద్ద కాకాని వద్ద ఓ ప్రమాదం జరిగింది. మార్గమధ్యలో టైర్ పగిలిన బైక్‌ను వెనకనుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 

ఈ సంఘటన జరిగినప్పుడు అటుగా వెళుతున్న ఎమ్మెల్యే శ్రీదేవి తన వాహనంలో నుంచి దిగి అంబులెన్సుకు ఫోన్ చేశారు. అంబులెన్స్‌ వచ్చేంత వరకూ  అక్కడే ఉన్నారు. అంబులెన్స్ వచ్చిన వెంటనే అందులో ఉన్న వైద్య పరికరాలతో శ్రీదేవి క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. తలకు గాయాలైనందున ఏ ఆసుపత్రికి వెళ్లాలో కూడా అంబులెన్స్ డ్రైవర్‌కి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మానవత్వంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఆమెపై నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.