ముగ్గురూ ముగ్గురే.. ఇందులో మొనగాడు ఎవరు..? - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురూ ముగ్గురే.. ఇందులో మొనగాడు ఎవరు..?

July 12, 2017

రాబోయే ఎలక్షన్స్ 2019లో.సరిగ్గా ఏడాదిన్నర టైమ్ ఉంది. ఏపీలో మాత్రం అప్పుడే ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. పోటీలు పడి విపక్ష నేత జగన్ హామీలు కురిపిస్తుంటే.. సంక్షేమ పథకాల అమలును సీఎం చంద్రబాబు స్పీడప్ చేశారు. సందట్లో సడేమియా అన్నట్లు అప్పడప్పుడు గబ్బర్ సింగ్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో గర్జిస్తున్నారు.ఈ ముగ్గురు ముగ్గురే..ఇందులో గెలుపెవరిది వచ్చే ఎన్నికల్లో..?మళ్లీ బాబుకే పట్టం కడుతారా..?జగన్ ని ఈసారైనా జనం నమ్ముతారా..?రీల్ హీరో పవన్ కల్యాణ్ రియల్ హీరో అవుతారా..? ఈముగ్గురిని నిశితంగా పరిశీలిస్తున్న మోదీ మూడో కన్ను తెరిస్తే..మటాష్ అయ్యేది ఎవరు..?

ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ చకచకా మారిపోతున్నాయి. కొత్త పథకాలు…సరికొత్త హామీలు..కొంగొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి.విపక్ష నేత , వైసీపీ అధినేత జగన్ .. పార్టీ ఎలక్షన్ ప్లానర్ అని ప్రశాంత్ కిశోర్ ను ప్లీనరీ వేదికపై పరిచయం చేశారు. అంతే టీడీపీ ప్లానర్స్ గ్లినర్స్ గిమిక్కులు పనిచేయవని ఒంటికాలుపై లేచింది. ప్రశాంత్ కిశోర్ ని మించిన మొనగాడి కోసం వేట మొదలైంది.అంతకు మించి ఇంటింటికి వెళ్లాలని డిసైడ్ అయింది.

పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఏపీ రాజధాని నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉన్న చంద్రబాబు.. ఏపీని సింగపూర్ లా మార్చకున్నా..ఏదో స్థాయిలో ఉంచుతారు. ఇందులో నో డౌట్. ఇవే ప్లస్ పాయింట్స్ చంద్రబాబుని అప్పుడు గెలిపించాయి..ఈ సారి కూడా గెలిపిస్తారనే నమ్మకం తెలుగు తమ్ముళ్లలో ఉంది. జనం కూడా బాబుకే మళ్లీ ఓ సారి అవకాశం ఇస్తే..ఏపీ రూపు రేఖలు కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు ఇప్పుడు. ఏడాది తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం..బాబు శ్రేణులకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాగే ఉంటే అసలకే ఎసరు రావొచ్చు.

ఇక జగన్ గత ఎన్నికల్లో చేసిన పొరపాటుని ఈ సారి చేయొద్దని ముందే నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుల్లో భాగంగా ఎలక్షన్ ప్లానర్ ప్రశాంత్ కిశోర్ ని ఎంటర్ చేశారు. బ్యాక్ ఆఫీసు పనులు చేసే ఈయన్ను జగన్ జనం ముందుకు తెచ్చారు. ఇదిగో 50 పర్సెంట్ గెలుపు దిక్సూచి అని ప్లీనరీ వేదికపై నుంచి చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి ప్రశాంత్ కిశోర్ లు వంద మంది వచ్చినా..ఎలక్షన్ నాటికి తెలుగోళ్ల మూడ్ ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరు. ప్రశాంత్ వైసీపీ బాహుబాలిలా జగన్ నమ్మినా..జనం నమ్మకపోవచ్చు…ఈయన స్ట్రాటజీ వాళ్లకు ఎక్కకపోవచ్చు. ఇంకో దారి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర. ఈ ఐడియా జగన్ జీవితాన్ని మార్చేయవచ్చు.ఎందుకంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కలిసి వచ్చింది పాదయాత్రే..ఇప్పుడు తండ్రిబాటలో నడిస్తే జగన్ కు కలిసిరావొచ్చు..ఇందులో నో డౌట్. ప్రజల్ని ప్రతక్షంగా కలిసి మాట్లాడే అవకాశం..వారి బాధల్ని వినే టైమ్.. జగన్ వేసే ఒక్క అడుగుకు వేల అడుగులు తోడయ్యే సందర్భం.. ఇవన్నీ ఎంతలేదన్నా జగన్ కు ప్లస్..బాబుకు మైనస్ అయ్యే అంశాలే.

అటు మూడో కృష్ణుడు కాచుకుని కూర్చున్నాడు. ఏపీలో పాగా వేయాలన్న కసితో ఉన్నాడు. మేకప్ కు ప్యాకప్ చేసి ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి దిగాలని డిసైడయ్యారు ట్విట్టర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తనకున్న రీల్ క్రేజ్ ను రియల్ హీరో అనిపించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. అప్పటిదాకా చేతిలో ఉన్న మూడు , నాలుగు సినిమాలు త్వరగా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. తాను వేలెత్తే చూపే వైపు కోట్లాది మంది నడుస్తారనే ధీమాలో ఉన్నారు. ఇప్పుడున్న క్రేజ్ బ్యాలెట్ బాక్స్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అన్నలాగే తమ్ముడు అన్న ఫీలింగ్ ఉంది. ఇది ఆయన ఎలా చెరిపేసుకుంటారో..క్యాస్ట్ ఈక్వేషన్స్ మాత్రం ఆయనకు ప్లస్ పాయింట్లు అవుతున్నాయి. గంప గుత్తగా ఓట్లు గుద్దేస్తారు. ఎందుకంటే ఈ ఇప్పటికే చంద్రబాబుపై ఆ సామాజిక వర్గం రగిలిపోతోంది. ఇది కూడా బాబు మైనస్ అయ్యే పాయింటే.

ఈ ముగ్గురి మొనగాళ్లని నమో మంత్ర నిశితంగా పరిశీలిస్తున్నారు. ముగ్గురితో టచ్ లోనే ఉన్నారు. ఎవరిని దూరంగా పెట్టడం లేదు..అదును చూసి ఎవరికి హ్యాండ్ ఇస్తారో చూడాలి. ఇంతకు ముందు ఇచ్చినట్టు చంద్రబాబుకు ఎన్డీయే లో ప్రయారిటీ ఇవ్వడం లేదు..ఎక్కువ చేస్తే తోక కట్ చేసే పరిస్థితి. అందుకే చంద్రబాబు..మోదీ సర్కార్ ని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేకపోతున్నారు. కాబోయే రాష్ట్రపతికి కాళ్లు మొక్కిన జగన్.. కేసీఆర్ స్ట్రాటజీ ని ఫోలో అవుతున్నారు. నమో నమో ఫాలో ఫాలో మి అంటున్నారు. ఉత్తరాది గిత్తరాది అని అప్పుడేప్పుడో కేకలేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్..లోటస్ అంటే లొట్టలేసుకుంటున్నారు. సో ముగ్గురు మొనగాళ్లలో ఏపీ లో ఏమో ఏ గుర్రం ఎగురావొచ్చో చూడాలి. మోదీ ఏ గుర్రంపై స్వారీ చేస్తారో..జనం ఏ గుర్రాన్ని ఆదరిస్తారో చూడాలి.. విపక్ష నేత జగన్ గుర్రంతో గబ్బర్ సింగ్ జోడికడితే పెదబాబు గుర్రం పని ఔట్. మొత్తానికి ఏడాదిన్నర ముందే ఎలక్షన్ వార్..ఎన్ని ఇంట్రెస్టింగ్ మలుపులు తీసుకుంటుందో..