కొత్త అల్లుడికి 67 ఐటమ్స్ వడ్డించిన అత్త  - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త అల్లుడికి 67 ఐటమ్స్ వడ్డించిన అత్త 

July 9, 2020

b cv nb

‘ఏంర బై పెండ్లి అయినంక మస్తు బలిశినవు. అత్తగారింటి వంటలు బాగా ఇంకుతున్నట్టున్నై’ అని ఫ్రెండ్ సర్కిల్‌లో ఆట పట్టిస్తుంటారు. పెళ్లికి మందు సన్నగా ఉన్నవాడు.. పెళ్లయ్యాక పొట్టతో లావెక్కడం గమనిస్తుంటాం. అత్తగారింటికి అల్లుడు ఎప్పుడూ  సెలెబ్రిటీనే.  ఎప్పుడు పోయినా రాచమర్యాదలే. అమ్మో అల్లుడు వస్తున్నాడని ముందుగా కంగారు పడేది అత్తే. కుమార్తెను అడిగి మరీ అల్లుడికి ఇష్టమైన వంటలను రెడీ చెయ్యాలని ఉబలాటపడుతుంది. అటు మరదళ్లు, ఇటు బావమరదులు కొసరి కొసరి వడ్డించడంతో అల్లుడు లావెక్కక్కపోతే సన్నబడతాడా ఏంటి? 

ఇక విషయంలోకి వద్దాం.  ఓఆంధ్రా అత్త అల్లుడి కోసం ఏకంగా 67 రకాల వంటలు సిద్ధం చేసింది. అనంత్ రూపంగుడి అనే అనే ట్విటర్ యూజర్ ఈ అత్త వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 

ఐదు పూటలకు సరిపడా 67 రకాల ఆహారాలను అల్లుడి కోసం రెడీ చేసింది. ‘ఏంటి అన్ని వంటలే.. తింటాడా అతను? తింటే రెండు రోజుల్లో పొట్ట రావడం ఖాయం’ అని అనిపిస్తోంది కదూ. కేకు కటింగ్ నుంచి మొదలుపెడితే చాట్, స్వీట్లు, బజ్జీలు, పులుసు, వడియాలు, లడ్డూలు, రొట్టె.. ఇలా చెప్పుకుంటూపోతే 67 రకాల వంటలు అవి. ఆమె ఈ వీడియోలో ఒక్కో వంటకం, వెరైటీల గురించి చక్కగా వివరించింది. చూస్తుంటే నోరు ఊరుతుంది.. కానీ అన్నేసి తినలేం అని కూడా అనిపిస్తోంది కదూ. అందుకే ఈ అత్తమ్మ ఐదు పూటలు అని అంటోంది. ‘మీ చేతి వంట ఎంత రుచిగా ఉంటే మాత్రం అన్నేసి అల్లుడు తింటాడా? భుక్తాయాసం అవగలదేమో జాగ్రత్త’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘మీక మదర్-ఇన్-లా ఆఫ్ ఇండియా అని అవార్డ్ ఇవ్వాల్సిందే. ఇంత మంచి అత్తలు అల్లుళ్లకు దొరకడం ఏ జన్మ పుణ్యమే’ అని మరొకరు జోక్ పేల్చారు. ప్యాట్రిక్ బ్రూక్‌మ్యాన్ అనే యూజర్ అయితే.. ‘నేను వచ్చే జన్మలో భారతీయ అల్లుడిగా పుడతాను’ అని తెలిపాడు.