ఆంధ్రజ్యోతి వద్ద ఉద్రిక్తత.. మోదీపై కథనాల ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రజ్యోతి వద్ద ఉద్రిక్తత.. మోదీపై కథనాల ఎఫెక్ట్

April 3, 2018

ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నేత, ప్రధానమంత్రి మోదీ వ్యక్తిత్వాన్ని కించపరచే కథనాలు ప్రచురిస్తున్నారంటూ బీజేవైఎం, ఏబీవీపీ తదితర సంఘాల కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్లోని పత్రిక ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకుని, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి. నరసింహారావు ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రజ్యోతిలో మోదీపై కథనాలు రాస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితంలోని అంశాలను ప్రస్తావిస్తున్నారు.  హిట్లర్‌తో ఆయనకు పోలికలు ఉన్నాయన్నారు. వీటిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దేశనేత వ్యక్తిత్వాన్ని మంటగలిపే ఈ కథనాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులో పెట్టేందుకు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.