తమ అభిమానులకు కష్టమొస్తే నాయకులు ఆదుకోవడం, భరోసా ఇవ్వడం మామూలే. అభిమానుల కష్ట సుఖాలను తమవిగా భావిస్తూ వారికి తోడునీడగా ఉంటారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విషయంలో ఇది మరోసారి రుజువైంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియల్లో ఆయన పాల్గొనడమే కాకుండా పాడె కూడా మోశారు.
సాయిబన్ పేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో క్రాంతికిరణ్ మంగళవారం మృతునికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తర్వాత ప్రవీణ్ పాడె మోశారు. అధైర్యపడొద్దంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.