Andol mla chanti Kranti kiran congratulated minister harish rao on Munugodu byelection victory
mictv telugu

కృష్ణార్జునుల్లా గెలిపించారు.. హరీశ్‌కు ఎమ్మెల్యే క్రాంతి అభినందన

November 7, 2022

Andol mla chanti Kranti kiran congratulated minister harish rao on Munugodu byelection victory

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. కీలక విజయం సాధించడంతో నేతలు పరస్పరం కలసి అభినందనలు తెలుపుకుంటున్నారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం వ్యూహాత్మకంగా పోరాడారంటూ ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అభినందించారు.

ఆయన సోమవారం హరీశ్ రావును కలిసి పుష్పగుచ్ఛమిచ్చి ముచ్చటించారు. ‘మహాభారతంలో కృష్ణార్జునులు వలే హరీశ్ రావు, కేటీఆర్ అద్భుతమైన వ్యూహాలతో మునుగోడులో గెలిపించారు. ప్రచారంలో పాల్గొన్న ఆందోల్ టీమ్‌కు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూ మెజారిటీ తెప్పారు. అందుకు హరీష్ రావు గారికి ధన్యవాదాలు’’ అని కిరణ్ అన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారంటూ హరీశ రావు ఆందోళ్ టీఆర్ఎస్ కార్యకర్తల బృందాన్ని అభినందించారు.