దళితబంధు కింద వాహనాలను అందజేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ - MicTv.in - Telugu News
mictv telugu

దళితబంధు కింద వాహనాలను అందజేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

April 5, 2022

 bfdhzdh

దళితబంధు పథకం కింద ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంగళవారం పలువురు లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. బడ్డాయిపల్లి గ్రామంలోని దళితులకు ట్రాక్టర్లు, జేసీబీ, బోలెరో వాహనాలతోపాటు 20 మంది లబ్ధిదారులకు డెయిరీ యూనిట్లకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు.

మర్పల్లి మార్కెట్ యాడ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రజలు ఘనంగా ఆహ్వానం పలికారు. ఆయన వారితో కలసి నృత్యం చేశారు. సహపంక్తి భోజనాల్లో పాల్గొని వారికి వాహనాలను పంపిణీ చేశారు. తర్వాత మార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ట్రాక్టర్లు, జేసీబీలతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరారెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు ఎంపీపీ కృష్ణవేణి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిట్ ఛైర్మెన్ రజినీకాంత్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు రైతు సమన్వయ సమితి నాయకులు మార్కెట్ కమిటీ నాయకులు హాజరయ్యారు.