దళితబంధు యూనిట్లకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ భూమి పూజ - MicTv.in - Telugu News
mictv telugu

దళితబంధు యూనిట్లకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ భూమి పూజ

March 25, 2022

దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కొనియాడారు. దళితులు ఆర్థికంగా పైకి రావడానికి దళిత బంధు పథకాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని అన్నారు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. శుక్రవారం ఆందోల్ నియోజకవర్గం వటపల్లి మండలంలోని బుడ్డాయి పల్లి గ్రామంలో ఆయన లబ్దిదారులతో కలిసి పలు యూనిట్స్‌కు భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు వారి యూనిట్స్‌కు సంబంధించిన పత్రాలను అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ ‘కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాను చూసి సహించలేక ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యడం సరికాదు. దళిత బంధు ఎన్నికల స్టెంట్ అని అనే విపక్ష నాయకులు బుడ్డాయి పల్లి గ్రామంలో అమలు అవుతున్న దళిత బంధు పథకం అమలు ద్వారా లబ్దిపొందుతున్న గ్రామాన్ని సందర్శించాలి. దళితుల ఆర్థిక ప్రగతిని తట్టుకోలేని నాయకులు లేని పోనీ అపోహలు సృష్టించడం మానుకోవాలి’ అని ఆయన హెచ్చరించారు. వెనుకబడిన దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే కేసీఆర్ దళిత బందు ద్వారా ఆర్థిక సహాయం చేసి అమలు చేశారన్నారు. దళిత బందును అడ్డుకుంటే పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. మరో నెలలో మన ఆందోల్ నియోజకవర్గానికి మరో రెండు వేల యూనిట్స్ మంజూరు కాబోతున్నాయని వెల్లడించారు. దళిత బంధు పథకం తమ గ్రామంలో సాకారం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

దళిత బంధు కింద బుడ్డాయిపల్లి గ్రామంలోని ప్రతి లబ్దిదారునికి 10 లక్షలు మంజూరు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎమ్మెల్యే సూచన మేరకు అధికారులు ఎంపిక చేశారు. గ్రామంలో 44 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి యూనిట్లు మంజూరు చేసేందుకు బ్యాంకు ఖాతాలు తెరిపించారు. లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా యంత్రాంగం కృషి చేస్తున్నది గ్రామంలో సదస్సులు నిర్వహించి లబ్ధిదారులకు యూనిట్ల పై పూర్తి అవగాహన కల్పించారు.