‘మహిళాబంధు’లో ఎమ్మెల్యే క్రాంతి నృత్యం - MicTv.in - Telugu News
mictv telugu

‘మహిళాబంధు’లో ఎమ్మెల్యే క్రాంతి నృత్యం

March 8, 2022

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు అందోల్‌లో ‘మహిళాబంధు కేసీఆర్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తోపాటు పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు కూడా పంపిణి చేశారు.

క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి, భద్రత కోసం సీఎం కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ పథకాలు, మాతా, శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి సేవలు అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం కోసం ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, మహిళలకు నీటి గోస లేకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేశారు. ఆడబిడ్డల ఉన్నత చదువుల కోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పారు. వృద్ధ మహిళలకు, వింతతు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నారు. అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచారు..’ అని ఆయన వివరించారు.