Andra Pradesh cm jagan mohan reedy distributed land documents
mictv telugu

ఒకే రోజు 1.23 లక్షల పట్టాలు, వాళ్లకు కడుపుమంట.. జగన్

April 28, 2022

Andra Pradesh cm jagan mohan reedy distributed land documents

పేదలకు ఉచిత స్థలం పట్టాలు, ఇళ్ల నిర్మాణంతో తన ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తన ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించడం విపక్షాలకు జీర్ణం కావడం లేదని మండిపడ్డారు. జగన్ గురువారం అనకాపల్లి జిల్లాలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం నుంచి 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీని ఆయన ప్రారంభించారు. గ్రామంలో 300 ఎకరాల్లో వేసిన 10,228 ప్లాట్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ స్థలాలు చాలా ఖరీదైనవని ఆయన అన్నారు. ‘గజం రూ.12 వేలు పలుకుతోంది. ఒక్కో కుటుంబానికి 50 గజాల స్థలంలో ఇల్లు కట్టిస్తున్నాం. పేదలను మేం ఇలా ఆదుకుంటుంటే కొందరు కడుపు మంటతో రగిలిపోతున్నారు. కోర్టులో కోర్టులు వేస్తున్నారు’ అని సీఎం మండిపడ్డారు. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలను ఏర్పాటు చేస్తామన్న ఆయన ప్రతి కాలనీలోస్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్వాడీ సెంటర్లు వంటివన్నీ ఉంటాయన్నారు. చంద్రబాబు హయాంలో 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని, కానీ, తమ ప్రభుత్వం మాత్రం 30 లక్షల ఇళ్లు కడుతుందని అన్నారు. 3.03 లక్షల మంది ఇళ్ల పట్టాలు, 25 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తామని వెల్లడించారు.