ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మెన్‌గా దేవిరెడ్డి  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మెన్‌గా దేవిరెడ్డి 

November 8, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి సీఎం జగన్ కొత్త చైర్మన్‌ను నియమించారు. కడపజిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ దేవిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లికి చెందిన శ్రీనాథ్ 40 ఏళ్ల కిందట ఆంధ్రప్రభ పత్రికలో కెరీర్ ప్రారంభించారు. రాయలసీమ సమస్యలపై ‘సెవెన్ రోడ్స్ జంక్షన్’  శీర్షిక కింద రాసిన వ్యాసాలు ఆయనకు పేరు తెచ్చాయి. ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితులు. 

srinath devireddy.

శ్రీనాథ్ 1990లలో కొన్నాళ్లు బీబీసీ రేడియోలోనూ పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు.  పనిచేశారు. జగన్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ఆయన చెప్పారు. సోషల్ మీడియా, డిజిటల్ యుగంలో గ్రామీణ విలేకర్లకు మళ్లీ శిక్షణ అవసరమని పేర్కొన్నారు.