సంక్రాంతి సంబరాల కోసం భారీ సంఖ్యలో ఊళ్లకు వెళ్తున్న వారి వాహనాలు రోడ్లపైకి రావడంతో అక్కడక్కడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. తండ్రీ కొడుకులైన వైసీపీ ఏంపీ ఎంపి మిథున్ రెడ్డి, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి త్రుటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సంక్రాంతి కోసం ఇద్దరూ ఒకే కాన్వాయ్‌లో బంధువుల ఇంటికి వెళ్తుండగా కడప జిల్లా రాయచోటి దగ్గర ప్రమాదం జరిగింది. వీరి కాన్వాయ్‌లోని ఓ బండిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి వీరబల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా చెన్నముక్కపల్లె రింగ్ వద్ద మిథున్ కారును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. మిథున్ కారు పల్టీలు కొట్టింది. ఆ సమయంలో మిథున్ ఆ కారులో కాకుండా తండ్రి పెద్దిరెడ్డి కారులో ఉన్నారు. ఈ ప్రమాదంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మిథున్ రెడ్డి రాజంపేట నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.