పహరా హుషార్.. ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్... - MicTv.in - Telugu News
mictv telugu

పహరా హుషార్.. ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్…

May 8, 2019

ఆంధప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ కార్మికు సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్ల పరిష్కార కోసం యాజమాన్యం మెడలు వంచడానికి నోటీసులు జారీ చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు ఈ రోజు 46 డిమాండ్లతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు ఇచ్చారు. వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని, సిబ్బంది కుదింపు, గ్రాడ్యుటీ తగ్గింపు,  అద్దె బస్సుల పెంపు నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పారు.

Andrapradesh rtc national mazdoor union workers issues notices to strike for solutions to their demands

ప్రస్తుత పరిస్థితిలో పనిచేయడం ఇబ్బంగా మారందని, సంస్థ మనుగడ కోసం ఆర్టీసీకి చెల్లించాల్సిన 670కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. సకాలంలో స్పందించకపోతే ఈనెల 22 తర్వాత ఎప్పుడైనా సరే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీంతో వారిని బుజ్జగించేందుకు యాజమాన్యం చర్చల కోసం కసరత్తు ప్రారంభించింది.