రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్‌ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్‌ మృతి

May 15, 2022

క్రికిటె ప్రియులకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ అంటే తెలియని వారుండరు. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లేలో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైమండ్స్‌ మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి, బోల్తా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ప్రమాద స‌మ‌యంలో సైమండ్స్ ఒక్కరే కారులో ఉన్నడని పేర్కొన్నారు. ఇటీవలే ఆసీస్‌ మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, రోడ్‌ మార్ష్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ రెండు ఘటనలు మరవకముందే మరో దిగ్గజ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి చెందడంతో ఆస్ట్రేలియా క్రీడాలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

సైమండ్స్‌ మృతిపట్ల ఆడమ్‌ గిల్‌క్రిస్ట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ”అతని మృతి నన్న ఎంతగానో కలచివేసింది. అతనితో ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ పీల్డ్‌లో మంచి అనుబంధం ఉంది” అని అన్నారు. సైమండ్స్‌ మృతి పట్ల ఐసీసీ సంతాపం తెలిపింది.

1998లో పాకిస్థాన్‌‌తో జరిగిన వన్డేతో ఆండ్రూ సైమండ్స్‌ అరంగేట్రం చేశాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. 198 వన్డేల్లో ఆరు సెంచరీలు, 30 అర్ధ సెంచరీలతో మొత్తం 5,088 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 37.26 సగటుతో 133 వికెట్లు తీసి, తన బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో జట్టు విజయాల్లో ప్రధానపాత్ర పోషించాడు.