బాడ్కవ్.. నేను తమిళకుట్టినిబే - MicTv.in - Telugu News
mictv telugu

బాడ్కవ్.. నేను తమిళకుట్టినిబే

October 20, 2017

సాయిపల్లవి మలయాళీ అని జనం అనుకుంటున్నారు. సినీ మీడియా కూడా అలాగే ప్రచారం చేస్తోంది. అయితే ఇదంతా ఒట్టిదని ‘ఫిదా’ పిల్ల తోక తొక్కిన తాచుపాములా గుస్సా అవుతోంది. తనను ఏమన్నా భరిస్తాను కాని మలయాళీ అంటే భరించలేనని ఆమె అంది. ‘నేను తమిళ అమ్మాయిని. అలాగే గుర్తించండి.. అలాగే పిలవండి’ అని అంటోంది. సాయిపల్లవి తొలి మూవీ మలయాళ ‘ప్రేమమ్’ కావడంతో అందరూ ఆమెను మలయాళీ అని భావిస్తున్నారు. మొత్తానికి ఈమెకు కోపం కాస్త ముక్కుమీదే ఉంటుంది. నానితో కలసి నటిస్తున్న మూవీ షూటింగ్‌లో ఇద్దరి మధ్య గొడవలు రావడం తెలిసిందే. ఫిదా ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకెళ్లిన ఆమె చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలు ఉన్నాయి. నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, శర్వానంద్‌తో మరో సినిమా చేస్తోంది అమ్మడు. ఈమె కొంతకాలంగా ఓ పెళ్లయిన తమిళ హీరోతో డేటింగ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై ఆమె స్పందించడం లేదు.