పిన్ నంబర్ చెప్పలేదని యువతిపై దొంగ అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

పిన్ నంబర్ చెప్పలేదని యువతిపై దొంగ అత్యాచారం

May 23, 2020

South Delhi

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ యువతిపై అత్యాచారం చేశాడు. సౌత్‌ఢిల్లీ పరిధిలోని జంగ్‌పురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఆ సమయంలో బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్న యువతిని బలవంతంగా ఇంట్లోకి ఈడ్చుకొచ్చాడు. దీంతో సదరు యువతి గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆమె నోరు మూసి, దాడి చేశాడు. గట్టిగా అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. బంగారం, డబ్బు, ఏటీఎం  కార్డు ఇచ్చి దాని పిన్ నంబర్ చెప్పాలని యువతిని బెదిరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో దొంగ దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అతడి బారినుంచి తప్పించుకుందామని ఎంత ప్రయత్నించినా అతని రాక్షసత్వం ముందు ఆమె తన మానాన్ని పోగొట్టుకుంది. 

అత్యాచారం చేస్తూనే ఆమెను గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించాడు. వెంటనే బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.
బాధితురాలు మరుసటి రోజు బాధితురాలు సౌత్‌ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను దొంగ తీవ్రంగా కొట్టి అత్యచారం చేశాడని, తనను కొట్టి చంపాలని చూశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లు, ఇన్‌ఫార్మర్ల సమాచారం మేరకు అతనిని సోనుగా గుర్తించారు. అతనిపై గతంలోనూ పలు దొంగతనం కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు.