Home > Featured > పిచ్చి పీక్స్.. నడిరోడ్డుపై జీపును తగలబెట్టుకున్నాడు..

పిచ్చి పీక్స్.. నడిరోడ్డుపై జీపును తగలబెట్టుకున్నాడు..

రోడ్డుపై ఓ జీపు ఆగివుంది. రోడ్డు రద్దీగా వుండటంతో ఎవరి వాహనాల్లో వాళ్లు వెళ్తున్నారు. ఇంతలో అక్కడికో వ్యక్తి వచ్చాడు. అతని మెడనిండా బంగారు నగలు వున్నాయి. చేతులకు ఉంగరాలు వున్నాయి. చూస్తుంటే బాగా కలిగినవాడిలా వున్నాడు. వస్తూ రాగానే ఆ జీపు పైకి అగ్గిపుల్ల గీసి విసిరేశాడు. అంతే జీపుకు ఒక్కసారిగా మంటలు ఆవరించాయి. దీంతో చుట్టుపక్కల వున్నవాళ్లు షాకయ్యారు. ఏం జరుగుతోంది అసలు అనుకుని అందరూ ముక్కున వేలేసుకుని చూస్తున్నారు. కొందరు జీపుకు మంటలు అంటుకున్న దృశ్యాన్ని చూసి తమ వాహనాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఏమైనా పాత కక్ష్యల నేపథ్యంలో ఎవరిదో జీపు తగలబెట్టారా అని జనాలు బిక్కుబిక్కుమని ఉరకలు పరుగులు పెట్టారు. కొందరు అక్కడ జరుగుతున్నదంతా ఫోన్‌లో వీడియో తీస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి అడిగారు. అతను చెప్పిన మాటలు విని వారంతా మరింత ఆశ్చర్యపోయారు. ఆ జీపు అతనిదేనని.. అతను తన ఫ్రెండేనని.. టిక్‌టాక్ వీడియో కోసం కాల్చేశాడని చాలా తాపీగా చెప్పాడు అతడు.

దీంతో అందరూ వారి నీ టిక్‌టాక్ పాడుగాను అని అందరూ తలోమాట తిట్టుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో పోలీసుల దృష్టికి వెళ్ళింది. వాళ్లు జీపు కాల్చుకున్న అయ్యగారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ఫైర్‌స్టేషన్‌కు కొద్దిదూరంలోనే ఈ పైత్యపు ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇంద్రజీత్ సింగ్ జడేజాగా పోలీసులు గుర్తించారు. కాగా ఇంద్రజీత్ గతంలో ఒక దుకాణంలో పనిచేసేవాడు. అతనిని ఏవో కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచి అతను ఆందోళతో ఉన్నాడు. దీంతోనే ఇంద్రజీత్ తన జీపుకు నిప్పు పెట్టుకున్నాడని అతని స్నేహితుడు తెలిపాడు. ఇంద్రజీత్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టిక్‌టాక్ మాయలో పడి ఏంచేస్తున్నారో మరిచిపోతున్నారని పోలీసులు అన్నారు. ఒకరిని మించి ఒకరు వీడియోలు రూపొందించాలనే క్రమంలో ప్రాణనష్టం, ఆస్తినష్టాలకు పాల్పడుతున్నారని.. ఇలా చేయడం సరికాదని.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Updated : 3 Sep 2019 6:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top