అంబానీ తలకిందులు..! - MicTv.in - Telugu News
mictv telugu

అంబానీ తలకిందులు..!

June 28, 2017

దేశంలోనే రిచెస్ట్ బిజినెస్ మెన్ లు ఎవరంటే అంబానీలే కనిపిస్తారు. ఇన్నాళ్లూ పట్టిందల్లా బంగారమైంది. ఏ రంగంలోకి ఎంటరైన వారిదే పై చేయి. వారి బిజినెస్ ఈక్వేషన్స్ ప్రత్యర్థులకు అందనంతలో ఉంటాయి. ఏటేటా ఫోర్బ్స్ జాబితా టాప్ ప్లేస్ లో ఉండే అంబానీ అన్నదమ్ముల్లో ఒకరి పరిస్థితి తలకిందులైంది. అన్నదమ్ముల్లో అప్పుల్లో కూరుకుపోయింది ఎవరు..?ఎందుకిలా అయిందంటే…

వేల కోట్ల బ్యాంకు రుణాలపై ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. కంపెనీలపై బ్యాంకులు ఒత్తిడి పెంచుతున్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో అనిల్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమ్మర్ అసెట్ సేల్ ను కొంత కాలం కొనసాగించాలని నిర‍్ణయించారు. ఇందులో భాగంగా అంబానీ ఆధ్వర్యంలో ఉన్న కంపెనీల రోడ్డు ఆస్తులను, సముద్రగర్భంలోని వ్యాపారాలను, ముంబై, ఢిల్లీలోని ప్రైమ్ రియల్ ఎస్టేట్ లను అమ్మడానికి ప్రయత్నాలు చేస్తోంది. గ్రూప్ కు చెందిన ఫోన్ ట్రాన్స్ మిషన్ టవర్లను విక్రయించడం, తమ వైర్ లెస్ ఆపరేషన్లను ఎయిర్ సెల్ లిమిటెడ్ లో విలీనం చేయడం. ఒకవేళ ఈ రెండు డీల్స్ సరిపోకపోతే, వారం వ్యవధిలోనే రెండు ఇన్సియల్ పబ్లిక్ ఆఫర్లు చేపట్టాలని గ్రూప్ కు చెందిన ఫైనాన్స్ యూనిట్లు నిర్ణయించాయి. గ్రూప్ రుణాలను మూడింతలు తగ్గించడానికి రూ.29,038కోట్లు మేర నిధులను సమీకరించాలని అనిల్ అంబానీ టార్గెట్ పెట్టుకున్నారు.

రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ ఇప్పటికే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ లతో సమావేశమైందని, రుణాలను తగ్గించడానికి ఆస్తులను విక్రయించాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. తన కంపెనీ దీర్ఘకాలంలో వాటాదారుల విలువ పెంచడానికి ప్రయత్నిస్తుందని, అలాగే రుణాలు కూడా పరి మిత స్థాయిలో ఉంచేందుకు కృషి చేస్తుందన్నారు అనిల్ అంబానీ. ఆర్కామ్ కు ఇప్పటికే రూ.45వేల కోట్ల మేర రుణాలున్నాయి. అన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దెబ్బకు ఈ రుణాలు భారీగా పెరిగాయి. కంపెనీ రుణాలు పెరిగిపోవడంతో షేర్లు కూడా కనీసం 60 శాతం పడిపోయాయి.దీంతో రుణాల్ని తీర్చేందుకు ముమ్మరంగా అనిల్ అంబానీ ప్రయత్నిస్తున్నారు. కాలం కలిసి రాకపోతే ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో.