అన్న బాటలో తమ్ముడు... - MicTv.in - Telugu News
mictv telugu

అన్న బాటలో తమ్ముడు…

August 12, 2017

ఇంట్ల మీట నొక్కితే వాకిట్లోలైట్ వెలగడం అంటే ఇదే కావొచ్చు. ఈ మధ్య కాలంలో  సెల్ ఫోన్ల సెక్టార్లో రిలయెన్స్  జీయో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మిగిలిన మోబైల్ ఆపరేటర్లను కండ్లు బైర్లు కమ్మి కింద పడేట్లు చేసింది.  అన్నీ కంపెనీలు చేతనైనంత మేరకు ఆఫర్లు  ఇచ్చాయి.  కొన్ని కంపెనీలు మాత్రం నాలుగు రోజులైతే  జనాలకు దిమ్మ తిరిగి బొమ్మ  కన్పించి మన వద్దకే వస్తారు లే అనే ధీమాతో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇంకా కొన్ని కంపెనీలు ఈ గండం  గట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు.  రిలయెన్స్ అధినేత కన్నీళ్లు  పెట్టుకుని మరీ ప్రకటించిన ఆఫర్ ఫోన్ పాటు మాట్లాడుకున్నోళ్లకు మాట్లాడుకున్నంత ఫ్రీ అన్నారు. ఆ తర్వాతనే అస్సలు స్టోరీ స్టార్ట్ అయింది.

అక్కడ అన్న ముఖేష్ ఇంట్లో మీట నొక్కితే ఇక్కడ  తమ్ముడు నడుపుతున్న ఆర్ కామ్ లో లైట్ వెలిగింది. ఇప్పటికే 40వేల కోట్ల దాంక అప్పుల్లో మునిగి కొట్టుమిట్టాడుతున్న అనీల్ కూడా అన్నను తట్టుకునేందుకు కష్టమైనా సరే అని 299 రూపాయల ఆఫర్ ఇచ్చారు కస్టమర్లుకు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కూడా ట్వీట్ మన్నారు. కొత్త పాలసీ తేలేకనో… లేక పోతే ఇప్పటికే ఉన్న కష్టాలకు తోడు కొత్త ప్రయోగాలు చేసి  ఇబ్బందులు పడటం ఎందుకనో గాని కాస్త ఆటు ఇటుగా అన్న రూట్ నే ఫాలో అవుతున్నారు తమ్ముడు గారు.