రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌ను పలువురు బాలీవుడ్ సీనియర్ నటులు పరామర్శించారు. అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్‌లు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి వెళ్లి పంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మీడియాకు వివరించారు. ఎలాంటి ఆందోళన అవసరంలేదు అన్నారు. పంత్ తల్లి, ఇతర బంధువులతో మాట్లాడామని వెల్లడించారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న పంత్‌ను అనుపమ్ ఖేర్ నవ్వించినట్లు చెప్పారు.
కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటికి వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామును పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తన మెర్సిడెస్ బెంజ్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రూర్కీ సమీపంలో రోడ్డు డివైడర్‌ను పంత్ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ సమయంలో కారులో మంటలు చెలరేగాయి.వెంటనే కారు అద్దాలను పగులగొట్టి, పంత్ బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే తీవ్రంగా గాయాలయ్యాయి. పంత్ తల, వీపుకు దెబ్బలు తగిలాయి. కాలు విరిగినట్టు తెలుస్తోంది. తిరిగి పంత్ మైదానంలో అడుగుపెట్టేందుకు సుమారు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.