ఐపీఎల్ నిర్వహణపై అనిల్ కుంబ్లే విచారం - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్ నిర్వహణపై అనిల్ కుంబ్లే విచారం

September 11, 2020

anil kumble about Indian Premier League

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగబోయే ఈ టోర్నీ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.‌

ఇదిలా ఉంటే ఐపీఎల్‌ పై టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ నిర్వహిస్తున్న లక్ష్యం గాడి తప్పుతుందని విచారం వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో జట్లకు కోచ్‌, మెంటర్లుగా ఎక్కువగా శాతం భారతీయులను తీసుకోవాలని ఉద్ధేశించిందని అన్నారు. కానీ, అందుకు భిన్నంగా విదేశీ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. స్వదేశీ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ లీగ్‌ను రూపొందించినట్టు తెలిపారు. ఈ విషయంలో కూడా స్వదేశీ ఆటగాళ్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.