పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను పవన్ బర్తడే సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ‘వై దిస్ కొలవరి ఫేమ్ అనిరుధ్ త్రివిక్రమ్, పవన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆ సినిమాలో ఓ పాటను అనిరుధ్ పాడుతూ త్రివిక్రమ్ కు వినిపిస్తున్న వీడియోను పవన్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసారు.
ఆ వీడియోలో అనిరుధ్ పాట పాడుతుంటే త్రివిక్రమ్ పాటని వింటూ ఆస్వాదిస్తున్నాడు. ఇంతవరకు త్రివిక్రమ్ తన మొదటి సినిమా అతడు నుంచి “సన్నాఫ్ సత్యమూర్తి” వరకు మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్ లతోనే కలిసి పనిచేశారు. ‘అ ఆ’ సినిమాతో త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్లను మారుస్తూ వస్తున్నారు. ’ఆ ఆ’ కు మిక్కీజె మేయర్ తో పనిచేస్తే, ఇప్పుడు పవన్ సినిమాకు అనిరుధ్ తో పనిచేస్తుండడం విశేషం.
r