ఆంజనేయుడు పుట్టింది మా రాష్ట్రంలోనే : బీజేపీ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆంజనేయుడు పుట్టింది మా రాష్ట్రంలోనే : బీజేపీ ఎంపీ

April 4, 2022

9

రామదూత హనుమాన్ పుట్టింది కర్ణాటక రాష్ట్రంలోనేనని ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ, భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ దర్శన్ యాత్రలో భాగంగా ఆయన అంజనాద్రి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘విజయనగరం జిల్లా అనెగొంది సమీపంలోని అంజనాద్రి కొండనే ఆంజనేయుని జన్మస్థలం. దీనిపై ఇతరుల అభిప్రాయాలు ఎలా ఉన్నా పర్వాలేదు. తిరుమలలో అంజనాద్రి కొండ ఉందని టీటీడీ వాళ్లు చెప్తున్నారు. కానీ, వాల్మీకి రచించిన రామాయణంలో చెప్పిన గుర్తుల ప్రకారం మన అంజనాద్రి దగ్గర పోలికలను కలిగి ఉంది. ఈ కొండ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను కేటాయించింద’ని వెల్లడించారు. కాగా, తిరుమలలోని జాబాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. ఈ రెండింటిలో ఏది నిజమైన జన్మస్థలమో తెలుసుకోవడం భక్తులకు ఇబ్బందిగా మారింది.