సుశాంత్ మాజీ ప్రేయసికి చిక్కులు.. ఓంకార బట్టలతో.. - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ మాజీ ప్రేయసికి చిక్కులు.. ఓంకార బట్టలతో..

September 16, 2020

Ankita Lokhande gets trolled for wearing 'Om' printed pyjamas

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే వివాదంలో చిక్కుకుంది. ఆమె ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. అంకిత తల్లి ఆమెకు చేసిన కొత్త హెయిర్ స్టైల్ చూపడానికి ఆమె ఈ ఫోటోలను చేసింది. ఆ ఫొటోలో ఆమె టీషర్ట్, పైజమా ధరించింది. ఆమె ధరించిన పైజామాపై ‘ఓం’ ముద్రించి ఉంది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

‘మేడమ్ నాకు మీపై పగ లేదు. నేను మిమ్మల్ని ఆటపట్టించడం లేదు. కానీ, మీరు ధరించిన పైజమాపై ఓం అని రాసివుంది. మేము ఓంకారాన్ని సృష్టికి చిహ్నంగా భావిస్తాము. మీరు ఓంకారం ఉన్న పైజమాను ధరించారు. ఈ విషయన్ని మీకు గుర్తు చేస్తున్నాను’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘దేవుని పేరును కాళ్లకు దగ్గరగా ఉంచడం చాలా తప్పు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అలాగే ఈ ఫోటోలను తొలగించాలని నెటిజన్లు కోరుతున్నారు. దీనిపై అంకిత ఎలా స్పందిస్తుందో చూడాలి. సుశాంత్.. అంకితలు ‘పవిత్ర రిస్తా’ అనే హిందీ సీరియల్ లో కలిసి నటించారు. 2016లో వీరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. రెండేళ్లు ప్రేమించుకున్నాక 2018లో విడిపోయారు.