Annapareddy appireddy financial support to civil service aspirant Priyanka
mictv telugu

కలెక్టర్ కల నెరవేరడానికి.. అన్నపరెడ్డి అప్పిరెడ్డి చేయూత

September 10, 2022

Annapareddy appireddy financial support to civil service aspirant Priyanka

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని‌ చింతలపాలెం మండలానికి చెందిన లకావత్ ప్రియాంకకు చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉంది. అందుకు అనుగుణంగా కష్టపడి చదివి మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కోసం కోచింగ్ తీసుకోవాలనుకుంది. అయితే తండ్రి చనిపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఐఏఎస్ కావాలన్న తన కోరిక తీరదని భావించింది.

ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న వర్క్ కాగ్, మైక్ టీవీ కంపెనీల అధినేత అన్నపరెడ్డి‌‌ అప్పిరెడ్డి , ఆమె కోచింగ్ ఫీజులు భరించేందుకు ముందుకు వచ్చారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత ( సి. యస్. ఆర్ ) కింద ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రియాంకతో వీడియో కాల్‌లో అప్పిరెడ్డి మాట్లాడారు. బాగా చదువుకుని మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కోరారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రియాంకంతో బిగ్ బాస్ ఫేమ్, హీరో సోహైల్ కూడా మాట్లాడారు. ఐఏఎస్ అయ్యి తెలంగాణకు పేరు తేవాలన్నారు. తనకు ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రోత్సహించిన అప్పిరెడ్డి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని ప్రియాంక చెప్పారు.

Annapareddy appireddy financial support to civil service aspirant Priyanka