అన్నపూర్ణ స్టూడియోలో మంటలు.. బిగ్‌‌బాస్ హౌజ్‌కు సమీపంలోనే - MicTv.in - Telugu News
mictv telugu

అన్నపూర్ణ స్టూడియోలో మంటలు.. బిగ్‌‌బాస్ హౌజ్‌కు సమీపంలోనే

October 16, 2020

vnmghmnghm

హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎంతమేర ఆస్తి నష్టం జరగిందని అనేది తేలాల్సి ఉంది. 

అక్కినేని కుటుంబానికి చెందిన ఈ స్టూడియోలో పలు సీరియళ్లు, సినిమాలు, రియాల్టీ షోలు షూటింగ్ చేస్తున్నారు. ఓ సినిమా కోసం వెసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తం  కావడంతో ప్రమాదం తప్పింది. దీనికి సమీపంలోనే కుడివైపున బిగ్‌బాస్‌ హౌజ్‌ కూడా ఉంది. దీంతో అంతా కొంతసేపు టెన్షన్ పడ్డారు. కానీ బిగ్ బాస్ సెట్‌కు దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.