త్వరలోనే తెలంగాణలో 250 ఉద్యోగాలకు ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలోనే తెలంగాణలో 250 ఉద్యోగాలకు ప్రకటన

March 19, 2022

ffb

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఖాళీగా ఉన్న 250 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న ఈ 250 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఖాళీలలో 150 పోస్టులను ప్రభుత్వం ప్రకటించిన.. ఉద్యోగ నియమాకాల్లో భాగంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ద్వారా భర్తీ చేస్తారని తెలిపింది. మిగిలిన 100 పోస్టులను పదోన్నతులు, కారుణ్య నియమాకాలతో పాటు 12.50 శాతం కోటా కింద శాఖాధిపతుల కార్యాలయాల ద్వారా బదిలీ అయ్యే వారికి కేటాయిస్తారని పేర్కొంది.

అయితే, రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నియమాకాల కోసం అభ్యర్థులు గరిష్ఠ వయోపరిమితి పెంపుపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఖాళీల భర్తీ ప్రకటన సందర్భంగా కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘పోలీసు వంటి యూనిఫాం సర్వీసులకు మినహా, ఇతర పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని పదేళ్ల పాటు పెంచుతున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం ఓసీలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు ఉండగా, దానిని 44కు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లు ఉండగా, దానిని 49కి, ఇక దివ్యాంగులకు 44 నుంచి 54 ఏళ్లు వయోపరిమితి పెంచనున్నట్లు తెలిపారు.

ఇందుకోసం ఆర్థిక శాఖలు, సాధారణ పరిపాలన శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేసీఆర్‌కు అందించాయి. రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కనిష్ఠ వయో నిబంధనలు యథాతథంగా ఉండబోతున్నట్టు సమాచారం.