అలర్ట్ : ఏపీలో పిడుగులు పడే ప్రాంతాల ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

అలర్ట్ : ఏపీలో పిడుగులు పడే ప్రాంతాల ప్రకటన

May 16, 2022

ఏపీ ప్రజలకు అలర్ట్. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ సోమవారం హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్ల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. పిడుగులు పడే ప్రాంతాలు ఇవే.

1. తిరుపతి
తిరుపతి అర్బన్, రేణిగుంట, నారాయణ వనం, కేవీబీ పురం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు
2. చిత్తూరు
నగరి, నిండ్ర, విజయపురం
3. అన్నమయ్య
కురబలకోట, మదనపల్లె, బి. కొత్తకోట, గుర్రం కొండ, కలికిరి, వాయల్పాడు
4. కర్నూలు
చిప్పగిరి, మద్దికెర ఈస్ట్, ఆదోని, ఆస్పరి, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం.
పైన తెలిపిన ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.