జగన్‌‌కు మద్యాభిషేకం - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌‌కు మద్యాభిషేకం

March 21, 2022

 

ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజుల నుంచి మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ, టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం నారా లోకేశ్ ఆధ్వర్యంలో మద్యనిషేధం హామీని మరిచి.. సారా, జె బ్రాండ్‌తో మహిళల తాళిబొట్లు తెంచేస్తోన్న సారా సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.

అనంతరం మహిళలకి ఇచ్చిన మాట తప్పిన సీఎం చిత్రపటంపై జె బ్రాండ్ మద్యం పోసి నిరసన తెలిపారు. సారా, జె బ్రాండ్ల మద్యం మరణాలపై న్యాయవిచారణ చేయాలని, అసెంబ్లీలో చర్చ జరగాలని, ఒక్కో మృతుని కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవలే కల్తీసారా తాగి 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రమంతటా మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.