Another 15 degrees and 33 Gurukuls in Telangana..in this district
mictv telugu

తెలంగాణలో మరో 15 డిగ్రీ, 33 గురుకులాలు..ఈ జిల్లాలోనే

September 23, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో గురుకులాలకు శ్రీకారం చుట్టిన సర్కార్..మరో 15 బీసీ డిగ్రీ గురుకులాలు, 33 గురుకులాలను మంజూరు చేస్తూ, గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 262 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక డిగ్రీ కాలేజీ అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్న నేపథ్యంలో రాను రాను గురుకులాలకు భారీ డిమాండ్ పెరుగుతుండడంతో అధికారులు మరిన్ని గురుకులాలను నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరిన్ని బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని కోరుతూ, తాజాగా కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపించారు.

ఈ క్రమంలో స్పందించిన కేసీఆర్..అధికారులు పంపించిన ప్రతిపాదనలను ఆమోదించారు. నూతనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలను మంజూరు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా సగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకులాలను ఏర్పాటు చేస్తుండటంతో బీసీ విద్యార్థుల చదువులకు భరోసా ఏర్పడిందని కొనియాడారు.

కొత్త బీసీ డిగ్రీ కళాశాలలు ఈ జిల్లాలోనే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ధర్మపురి, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, జనగామ పాలకుర్తి, జనగామ స్టేషన్‌ఘన్పూర్, నల్లగొండ నాగార్జునసాగర్, మహబూబ్ నగర్ దేవరకద్ర, వనపర్తి వనపర్తి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరాలను వెల్లడించారు.