మరో నలభై ఏళ్లు బీజేపీదే హవా: హిమంతా - MicTv.in - Telugu News
mictv telugu

మరో నలభై ఏళ్లు బీజేపీదే హవా: హిమంతా

July 3, 2022

భారతదేశంలో రాబోయే 30-40 ఏళ్లపాటు బీజేపీనే అధికారంలో ఉంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు హాజరైన హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. “ఈరోజు జరిగిన రాజకీయ తీర్మాన చర్చలో మోదీ పాల్గొన్నారు. సుధీర్ఘంగా చర్చలు జరిపి అనేక అంశాలలో మార్పులు, చేర్పులు చేశాం. ఈశాన్య రాష్ట్రాల్లో మరింత అభివృద్దిపై నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపదీ ముర్మూ జీవితంపై ఓ చిత్రాన్ని కూడా తీయాలని నిర్ణయించాం” అని ఆయన అన్నారు.

అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో భారత్ మిగతా దేశాలకు దారిచూపే ‘విశ్వ గురువు’గా ఎదుగుతుంది. కానీ, ఈ కుటుంబ పాలనలు, కుల రాజకీయాలు, వెన్నెముకలేని రాజకీయాలు దేశానికి పట్టిన దరిద్రాలు. ఏళ్ల తరబడి దేశ దుస్థితికి ఇవే కారణం. ఇప్పుడు, విపక్షాల్లో ఐక్యత లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు వారి సొంత పార్టీలోనే అంతర్గత ప్రజాసామ్యం కోసం కుమ్ములాడుకుంటున్నారు” అని ఆయన అన్నారు.