Another 86 junior colleges in Telangana: Somesh Kumar
mictv telugu

తెలంగాణలో మరో 86 జూనియర్ కాలేజీలు: సోమేశ్ కూమార్

July 2, 2022

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం బీఆర్కే భవన్‌లో అన్ని సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

అనంతరం సోమేశ్ కూమార్ మాట్లాడుతూ..”75 ఎస్సీ, 7 ఎస్టీ, 4 బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. రాష్ట్రవ్యా ప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్స్ ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఆ కాన్సెప్ట్ నోటును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. ఈ నోటు తదుపరి సూచనల కోసం సీఎంకు అందజేయాలి. అన్ని గురుకుల పాఠశాలల్లో పరిశుభత్ర కోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాం. వంట సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నాం.” అని ఆయన అన్నారు.

మరోపక్క తెలంగాణవ్యాప్తంగా కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమల్లో భాగంగా సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతోంది. ఇప్పటికే వెయ్యికి పైగా సంస్థలు ఉన్నాయి. కొత్తగా మరో 86 జూనియర్‌ కాలేజీలు రానున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో సోమేశ్ కూమర్ అధికారులతో సమావేశమై జూనియర్ కాలేజీలకు సంబంధించిన విషయాలపై చర్చించారు.